‘బొమ్మ’కు బ్రేక్… హీరోల ఖుష్ – ఐ బొమ్మ మూసివేతతో పైరసీ ముగిసినట్టేనా?
సహనం వందే, హైదరాబాద్:సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉన్నత చదువులు చదివి రెండు కంపెనీలకు సీఈఓ స్థాయికి ఎదిగిన ఓ యువ మేధావి… చీకటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆయనే ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ సైట్లకు సూత్రధారి ఇమ్మడి రవి. తన కంప్యూటర్ టెక్నాలజీ నైపుణ్యాన్ని సరైన మార్గంలో కాకుండా సినిమా పరిశ్రమను నాశనం చేసే పైరసీ దారికి మళ్లించాడు. రవి టెక్నాలజీ నైపుణ్యం చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. అతనిని జైలుకు పంపించడంతో…