సోషల్ మీడియాలో ‘రేజ్ బెయిట్’ షేక్ – ఆక్స్ఫర్డ్ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్’గా ఈ పదం
సహనం వందే, హైదరాబాద్: ప్రముఖ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ సంస్థ ఈ ఏడాదికి గాను ఒక సంచలనాత్మక పదాన్ని ప్రకటించింది. ఈ ఏడాది వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా ‘రేజ్ బెయిట్’ (Rage Bait) ను ఎంపిక చేసింది. అంటే మనల్ని కావాలని కోపం తెప్పించడానికి… ఆగ్రహాన్ని రేకెత్తించడానికి వాడే కంటెంట్ అని అర్థం. గత 12 నెలల్లో ఈ పదం వాడుక ఏకంగా మూడు రెట్లు పెరిగిందంటే సోషల్ మీడియాలో ఆగ్రహం ఏ స్థాయిలో…