ఆన్ లైన్ లో సరు’కుళ్లు’- బ్లింక్ ఇట్, జెప్టో, జొమాటోల నాసిరకం సప్లై
సహనం వందే, హైదరాబాద్: ఆన్ లైన్ ఫ్లాట్‌ఫామ్‌లలో మనం నిత్యం కొనే సరుకులు ఎంతవరకు సురక్షితం? తాజా తనిఖీల్లో వెల్లడైన వివరాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీ, రిలయన్స్ జియోమార్ట్, జెప్టో, బ్లింక్ ఇట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల స్టోరేజ్ సెంటర్లు, గోదాముల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఎంత దారుణంగా ఉల్లంఘనకు గురవుతున్నాయో ఈ దాడులు బట్టబయలు చేశాయి. గడువు ముగిసిన, నాణ్యత లేని సరుకులను అమ్ముతూ ఈ సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయనే…