
నర్మెట్ట వెనుక త్రిబుల్ ‘ఎస్’ల కుట్ర – సురేందర్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డీల స్కెచ్
సహనం వందే, హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నర్మెట్ట లో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ మెగా ఫ్యాక్టరీ వెనుక ఘరానా దోపిడి జరుగుతుందని ఆయిల్ పామ్ గ్రోయర్స్ అసోసియేషన్ మండిపడుతుంది. ఏమీ లేకుండా ఆయిల్ ఫెడ్ అక్కడ అంత పెద్ద ఫ్యాక్టరీ ఎందుకు కడుతుందని అసోసియేషన్ నాయకులు నిలదీస్తున్నారు. దాని వల్ల ఆ ప్రాంత ఆయిల్ పామ్ రైతులకు ఏమైనా ఉపయోగం ఉందా? లేక ఆయిల్ ఫెడ్ కేవలం రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు దోచి పెట్టటానికి ఇదంతా చేస్తుందా?…