
ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన
సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…