
నేత్రావతి ఒడ్డున శవాల గుట్టలు – ధర్మస్థల నరబలుల మారణకాండ
సహనం వందే, కర్ణాటక:కర్ణాటకలోని పవిత్ర శైవక్షేత్రం ధర్మస్థల చుట్టూ భయానక రహస్యాలు కమ్ముకున్నాయి. పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా జరిగిన దారుణ హత్యలు, క్షుద్రపూజల పేరుతో నరబలులు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఒంటరిగా కనిపించిన యువతులు, బాలికలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేసి, శవాలను రహస్యంగా పూడ్చిపెట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో ఈ దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తవ్వకాల్లో మానవ అస్థిపంజరాలు, ఎముకలు లభ్యమవడం…