
ఈ బిల్లు అప్పుడుంటే…’మహాత్ముడూ ప్రధానిగా అనర్హుడే’
సహనం వందే, హైదరాబాద్:దేశం కోసం జైలుకు వెళ్లిన మహనీయులు… ప్రజాస్వామ్యం కోసం పోరాడిన యోధులు… చివరకు చిన్నపాటి కేసుల్లో అరెస్టయిన ముఖ్యమంత్రులు… ఇలా ఎందరో భారత రాజకీయ చరిత్రలో జైలు శిక్ష అనుభవించిన వారే. అలాంటి వారందరినీ ఒక బిల్లుతో పదవుల నుంచి అనర్హులుగా ప్రకటించవచ్చని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లు ఇప్పుడు తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఏదైనా కేసులో నెల రోజులు జైలులో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులను పదవి నుంచి…