దైవిక చిత్రాలు… కనక వర్షాలు – పురాణ పాత్రలే ఇప్పుడు సూపర్‌హీరోలు
సహనం వందే, ముంబై:భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఆధ్యాత్మిక తరంగం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. హిందూ పురాణాలు, దైవత్వ అంశాలను ఆధునిక సాంకేతికతతో భారీ యాక్షన్ కోణంలో తెరకెక్కించే ట్రెండ్ ఊపందుకుంది. సమాజంలో ఆధ్యాత్మిక భావనలు, సాంస్కృతిక అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. దేవతలు, రాక్షసులు, భక్తుల కథలను హాలీవుడ్ స్థాయి సూపర్‌హీరో యాక్షన్‌తో కలిపి చూపడం బాలీవుడ్‌కు కొత్త ఉత్తేజాన్ని ఇస్తోంది. సమకాలీన సమస్యల్లో ఒక మార్గదర్శిని కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమాల…