ఆకలిపై షాట్… షుగర్ ఔట్ – బరువుపై అమెరికా ఫార్మా కంపెనీ బ్రహ్మాస్తం
సహనం వందే, న్యూఢిల్లీ:భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్…