ఆర్ఎంపీలకు రాజకీయ అండ’దండలు’ – మెడికల్ కౌన్సిల్ ఫైర్
సహనం వందే, హైదరాబాద్: ఆర్ఎంపీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అనర్హులైన ఆర్ఎంపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా నకిలీ వైద్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కౌన్సిల్ మండిపడింది. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అవకాశవాద రాజకీయాల కోసం అనర్హులైన వైద్యులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టరు అయినందున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి వైద్యుడిగా ఆయన పేరును…