
సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు
సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…