‘కారం’తో రగిలిన కోల్ కతా – పశ్చిమబెంగాల్లో మిరప పొడితో నిరసన
సహనం వందే, కోల్ కతా:పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వంపై సమరశంఖం పూరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా బీజేపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు తెరతీశారు. దుర్గాపూర్ మెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను అస్త్రంగా చేసుకుని కోల్‌కతా సాల్ట్ లేక్ మెట్రో స్టేషన్ వద్ద మహిళలకు ఎర్ర మిరప పొడి ప్యాకెట్లు పంచారు. ఈ ఆపరేషన్ లాల్ మిర్చి పేరుతో చేపట్టిన…