
2 రూపాయల ఫీజు… 18 లక్షల రోగులు – 50 ఏళ్లుగా అదే ఫీజుతో వైద్య వృత్తికి గౌరవం
సహనం వందే, కన్నూర్:500 రూపాయల ఫీజు… 5 వేల రూపాయల వైద్య పరీక్షలు… వేల రూపాయల మందులు… ఇలా రోగులను దోచుకుంటున్న కొందరు డాక్టర్లను… కార్పొరేట్ ఆసుపత్రులను నేడు మనం చూస్తున్నాం. కానీ కేరళ రాష్ట్రం కన్నూర్ కు చెందిన డాక్టర్ ఎ.కె. రైరు గోపాల్ కేవలం రెండు రూపాయల ఫీజుతోనే రోగులకు వైద్యం చేయడం ఎంతో విశేషం. 50 ఏళ్లుగా ఆయన అదే ఫీజు వసూలు చేస్తున్నట్టు ఆశ్చర్యకరం. రెండు రూపాయల డాక్టర్ గా పేరొందిన…