జైలు పాలవుతున్న జస్టిస్ – నేరం నిరూపితం కాకుంటే జైల్లోనే జీవితం
సహనం వందే, న్యూఢిల్లీ:భారతీయ న్యాయం కళ్ల గంతలు కట్టుకుని ఉందంటే బహుశా ఇదేనేమో! దేశంలో అత్యున్నత న్యాయస్థానం నుంచి వచ్చిన మాటలు ఇవి. సుప్రీంకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్ స్వయంగా విడుదల చేసిన నివేదిక ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తోంది. మన జైళ్లలో మగ్గుతున్న మొత్తం ఖైదీల్లో 70 శాతం మందికి పైగా ఇంకా అండర్‌ట్రయల్స్ (నేరం రుజువు కానివారు) కావడం వ్యవస్థకు అద్దం పడుతోంది. ఎంతోమంది పౌరులు దోషులుగా తేలకముందే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవిస్తుంటే న్యాయం…