ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు
సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…