క్రికెట్ క్వీన్స్… ప్రైజ్ మనీ అదుర్స్ – ప్రపంచ కప్ విజయంతో రూ. 90 కోట్ల ప్రైజ్
సహనం వందే, న్యూఢిల్లీ:క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన తుది పోరులో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తుచేసి భారత నారీశక్తి తమ సత్తా చాటింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన నాయకత్వంలో ఈ చరిత్రాత్మక విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. దేశం గర్వించేలా చేసిన ఈ క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల వర్షం… కోట్లు కురిపిస్తున్న బీసీసీఐవిశ్వవిజేతగా…