
కోచింగ్‌కు పన్ను… భవిష్యత్తుపై మన్ను – విద్యార్థుల జీవితాలతో 18% జీఎస్టీ ఆట
సహనం వందే, హైదరాబాద్:మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడొక కొత్త చిక్కు వచ్చి పడింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు, మరోవైపు పెరిగిపోయిన ఖర్చులు. ప్రభుత్వం ఇటీవల ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు, ఆన్‌లైన్ ట్యూషన్లకు 18 శాతం జీఎస్టీ విధించడంతో ఈ సంకట పరిస్థితి మరింత పెరిగింది. పాఠశాలలు, కళాశాలలు పన్ను పరిధి నుంచి మినహాయించిన ప్రభుత్వం… కోచింగ్ సంస్థలను విద్యాసంస్థలుగా పరిగణించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. పన్ను భారం వల్ల తల్లిదండ్రులు కోచింగ్ మానిపించి, పిల్లలను మళ్లీ పాఠశాల విద్యపై…