
గ్రూప్-1… గుండెల్లో గన్ – మూడున్నరేళ్ల నిరీక్షణ పటాపంచలు
సహనం వందే, హైదరాబాద్:మూడున్నరేళ్ల నిరీక్షణ… నిద్రాహారాలు లేని కఠోర శ్రమ… అసంఖ్యాకమైన ఆశల పతాక. వీటన్నింటికీ ప్రతిఫలంగా తుది జాబితాలో తమ పేర్లు చూసుకుని మురిసిపోయారు గ్రూప్-1 అభ్యర్థులు. నియామక పత్రాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు వారి ఆశలపై పిడుగుపాటులా పడింది. తుది జాబితాను రద్దు చేస్తూ మెయిన్స్ పేపర్లను తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించడం... లేదంటే మళ్ళీ పరీక్షలు పెట్టాలని సూచించడం… ఈ తీర్పుతో వారి గుండె ఝల్లుమంది. ఈ…