విదేశీ వర్సిటీల భారత్ వలస – ఇంటి ముందర ఖండాంతర విద్య
సహనం వందే, హైదరాబాద్: దశాబ్దాలుగా భారతీయ విద్యార్థులు విదేశీ చదువుల కోసం దేశం దాటి వెళ్లారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విదేశీ విశ్వవిద్యాలయాలే భారత్‌కు తరలివస్తున్నాయి. వీసా ఆంక్షలు, నిధుల కొరతతో అగ్రరాజ్యాల వర్సిటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మన దేశంలోని భారీ జనాభా, కొత్త విద్యా విధానం ఇప్పుడు ప్రపంచానికి ఆకర్షణీయంగా మారాయి. తిరగబడ్డ విద్యా చరిత్ర…భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి విద్యార్థులను ఎగుమతి చేసే దేశంగా ఉండేది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలకు లక్షల…