యువత మౌనం వెనుక మర్మం! – జెన్ జడ్ నిశ్శబ్దం… వీధుల్లోకి రాని నేటితరం
సహనం వందే, హైదరాబాద్:భారతదేశంలో దాదాపు 37 కోట్ల మంది జెన్ జడ్ యువత ఉంది. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో నిత్యం అనుసంధానమై ఉన్న ఈ శక్తిమంతమైన తరం… దేశంలో ఉన్న అవినీతి, అసమానతలు, రాజకీయ గందరగోళంపై తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తోంది. కానీ వీధుల్లోకి వచ్చి గళమెత్తడానికి మాత్రం వెనుకాడుతోంది. దేశద్రోహం ముద్ర పడుతుందనే భయం, కుల, ప్రాంతీయ విభజనలు, నిరుద్యోగంతో కూడిన ఆర్థిక ఒత్తిళ్లు, మార్పు అసాధ్యమనే నిరాశ… నేటి తరాన్ని నిశ్శబ్దంగా ఉంచుతున్నాయి….