
వినాయక చవితి విశిష్టత – సంతోషం పంచే సనాతన సంప్రదాయం
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక తాత్విక బోధనను అందిస్తుంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథుడిని ఆరాధించడం అనాది కాలం నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. విఘ్ననాయకుడు, విద్యాదాయకుడు, ఐశ్వర్యప్రదాత అయిన గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి రూపంలోనే ఎన్నో బోధనలు!వినాయకుడు గజాననుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, సిద్ధివినాయకుడు…