
జీరో యూరియా దందా… వ్యాపారుల మాయ- ఫ్యాక్టరీల నుంచి నేరుగా తెచ్చి వ్యాపారం
సహనం వందే, హైదరాబాద్:రైతుకు యూరియా కొరత నిద్రపట్టనివ్వడం లేదు. వ్యవసాయ పనులను పక్కనపెట్టి గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు క్యూలో నిల్చోవడం నిత్యకృత్యమైపోయింది. ఈ దుస్థితిని కొందరు డీలర్లు, వ్యాపారులు అవకాశంగా తీసుకుని యూరియా బ్లాక్ దందాకు తెరతీశారు. ప్రభుత్వం నిర్ణయించిన రూ. 270 విలువ గల 45 కిలోల యూరియా బస్తాను కొన్నిచోట్ల రూ. 500 పైగా అమ్ముతున్నారు. ఒక బస్తా కావాలంటే ఇతర సరుకులను కూడా కొనాలనే షరతులు, క్యాష్ అండ్ క్యారీ…