
పంట కోర్సుల్లో వాటా మంట – వ్యవసాయ డిగ్రీ కోర్సుల్లో కోటా కిరికిరి
సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విద్యలో ప్రవేశాల కోసం తెలంగాణలో కౌన్సెలింగ్ ప్రారంభమైనప్పటికీ రైతులు, వ్యవసాయ కూలీల కోటా అమలుపై విమర్శలు వచ్చాయి. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నా, కోటా నిబంధనలు గ్రామీణ వర్గాలకు నిజంగా న్యాయం చేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. రైతు, కూలీ కుటుంబాలకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ, కొన్ని విధానపరమైన లోపాలు ఆ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరం కంటే తక్కువ…