
ఎవరేమనుకుంటారో…? – ఈ ప్రశ్నే విద్యార్థుల ఆత్మహత్యకు కారణం
సహనం వందే, హైదరాబాద్:పరీక్షా ఫలితాలు వచ్చాయి. యోగిత తన గదిలో తలుపు వేసుకుని కూర్చుంది. రిలేటివ్స్ ఫోన్ల మోత… కోచింగ్ సెంటర్ల హడావుడి… గుమ్మం బయట తల్లి నిట్టూర్పు… ఇవన్నీ యోగితకు ఓ ఉచ్చులా బిగుసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కన్నీళ్లతో ఉన్న యోగిత తెల్లరేసరికి నిర్జీవంగా మారింది. ఇదొక్క యోగిత కథే కాదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలాంటి విషాదాలు నిత్యకృత్యం. మార్కులకు, ర్యాంకులకు ప్రాణం అర్పించే ఎంతోమంది విద్యార్థుల వేదన ఇది. 2022లో మన దేశంలో 1.7…