
‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య
సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి…