ఒళ్ళు హూనం చేసుకున్నా వృథానే – గంటల తరబడి వ్యాయామంతో లాభం లేదు
సహనం వందే, న్యూఢిల్లీ: బరువు తగ్గాలని కొందరు… కండలు పెంచాలని మరికొందరు జిమ్ముల్లో గంటల తరబడి ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. ఎంత ఎక్కువ కష్టపడితే అంత ఎక్కువ కేలరీలు కరుగుతాయని… త్వరగా సన్నబడతామని చాలామంది భ్రమపడుతున్నారు. కానీ మన శరీరం ఒక మిషన్ కాదు. దానికి ప్రకృతి సిద్ధంగా కొన్ని పరిమితులున్నాయి. ఒక స్థాయి దాటిన తర్వాత మీరు ఎంత కొట్టుకున్నా శరీరం అదనంగా ఒక్క కేలరీని కూడా ఖర్చు చేయదని తాజా అంతర్జాతీయ పరిశోధనలు కుండబద్దలు…