
కమ్యూనిస్టు కోటకు డిజిటల్ కిరీటం – మరో చరిత్ర సృష్టించిన కేరళ రాష్ట్రం
సహనం వందే, కేరళ:అక్షరాస్యతలో ఇప్పటికే దేశానికి దిక్సూచిగా నిలిచిన కేరళ… ఇప్పుడు డిజిటల్ అక్షరాస్యతలోనూ అదే మైలురాయిని అధిగమించింది. కేవలం 18 నెలల్లోనే ‘డిజి కేరళ’ కార్యక్రమం ద్వారా 100% డిజిటల్ అక్షరాస్యతను సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఇటీవల అధికారికంగా ప్రకటించారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఓ మహా ఉద్యమంలా సాగిన ఈ ప్రయాణం… కోట్లాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. స్వచ్ఛంద సైనికుల విజయగాథస్థానిక…