బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే
సహనం వందే, బీహార్:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది….