కామినేనికి ‘కోటి’తో చెంపపెట్టు – నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం తీర్పు
సహనం వందే, నల్లగొండ:నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లిలో ఉన్న కామినేని ఆసుపత్రి వైద్యులు చేసిన ఘోర నిర్లక్ష్యంపై జిల్లా వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. డాక్టర్ల తప్పిదం కారణంగా బాలింత మరణించిన కేసులో మృతురాలి కుటుంబానికి ఏకంగా కోటి రూపాయల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించడం సంచలనం అయ్యింది. డెలివరీకి వచ్చి ప్రాణాలు కోల్పోయి…నల్గొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అస్నాల స్వాతి డెలివరీ కోసం 2018 జూలై 13న కామినేని ఆసుపత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు…