’87 వేల కోట్ల’ న్యూ ఇయర్ గిఫ్ట్ – బిర్లాకు కేంద్ర క్యాబినెట్ కళ్ళుచెదిరే కానుక
సహనం వందే, న్యూఢిల్లీ: భారత కుబేరుడు బిర్లాకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కళ్ళు చెదిరే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల కుప్పగా మారిన వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం బిగ్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బకాయిలు 87,695 కోట్ల రూపాయలను దశాబ్దాల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2032-41 మధ్య ఆ బకాయిలు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. బిర్లా ఆధ్వర్యంలో…