సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు
సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…