ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…