
దారికడ్డంగా నిలబడే పెనుభూతమే కులవ్యవస్థ
సహనం వందే, హైదరాబాద్:దేశవ్యాప్తంగా అణగారిన కులాలు తమకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. అయితే ఆ పోరాటాలన్నీ ప్రాంతీయ ఉద్యమాలుగాను, స్థానిక పోరాటాలుగానూ మిగిలిపోతున్నాయి. ఈ పోరాటాలన్నీ విడివిడి ఘటనలుగానూ, గుంపు తగాదాలుగానూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నో ఉద్యమాలు గుర్తింపునకు నోచుకోలేదు. అలాగే అంబేద్కర్ జీవితాంతం అణగారిన వర్గాలకోసం చేసిన పోరాటం సంబంధిత ప్రజల దృష్టికి పోనేలేదు. కనీసం 50 శాతం మందికి కూడా తెలియదంటే అతిశయోక్తిలేదు. “ఓటు హక్కు ద్వారా పోరాడి రాజులు…