
లోటెక్ పోస్టులకు బీటెక్ డిమాండ్ – ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది పోటీ
సహనం వందే, రాజస్థాన్:రాజస్థాన్‌లో 53 వేల ప్యూన్ పోస్టుల కోసం 25 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడటం విస్మయం కలిగిస్తుంది. ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో వెల్లడిస్తోంది. కేవలం పదో తరగతి అర్హతతో కూడిన ఈ పోస్టులకు 90 శాతం మంది డిగ్రీలు, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్ డీ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన యువత పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితి నిస్సందేహంగా యువత ఆకాంక్షలను అవమానపరిచేదిగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల…