పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More