
అసెంబ్లీలో అఖండ ‘చంద్ర’ప్రచండ – చంద్రబాబునూ వదలని బాలయ్య బాబు
సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల…