అమెరికాపై ‘యూరప్పా’రప్పా – ట్రంప్ అస్త్రానికి మించి యూరప్ బ్రహ్మాస్త్రం!
సహనం వందే, యూరప్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలుపై చేస్తున్న వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. తన మాట వినకపోతే ఐరోపా దేశాలపై సుంకాల బాదుడు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు బెదరకుండా యూరప్ తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీస్తోంది. ఆయుధం పేరు యాంటీ కోయర్షన్యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక దేశం తన రాజకీయ ప్రయోజనాల కోసం మరో దేశంపై ఆర్థికంగా…