అమెజాన్ ‘టైమ్’ సేల్ – వస్తు డెలివరీలో రోజుల నిరీక్షణకు చరమగీతం
సహనం వందే, హైదరాబాద్: అమెజాన్ ఇప్పుడు కేవలం వస్తువుల అమ్మకందారు మాత్రమే కాదు… సమయాన్ని అమ్ముతూ జేబులు గుల్ల చేసే వ్యాపారిగా మారుతోంది. వారం రోజుల వెయిటింగ్‌కు మంగళం పాడుతూ ఆర్డర్ ఇచ్చిన 45 నిమిషాల్లోనే వస్తువును మీ గుమ్మం ముందుకు తెచ్చేలా స్కెచ్ వేసింది. ‘ఎవ్రీథింగ్ స్టోర్’ నుంచి ‘ఎవ్రీ అవర్ స్టోర్’గా మారి… రోజులో ప్రతి గంటను క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా జేఫ్ బెజోస్ సామ్రాజ్యం కొత్త యుద్ధానికి తెరలేపింది. దీనికోసం ప్రత్యేక రుసుములు…