
90 ఏళ్ల బుల్లెట్టు… రేస్ వాకర్- అలాన్ పోయిస్నర్ స్ఫూర్తి గాథ
సహనం వందే, అమెరికా:వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని డాక్టర్ అలాన్ పోయిస్నర్ నిరూపిస్తున్నారు. 90 ఏళ్ల వయసులోనూ అలుపెరుగని స్ఫూర్తితో ముందుకు సాగుతున్న ఆయన, రేస్‌వాకింగ్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు స్వర్ణ పతకాలు సాధించారు. తన వయసు విభాగంలో రికార్డులు నెలకొల్పిన ఆయన, నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నా వయసు 90… కానీ నేను యువకుడినేతనను ఎవరైనా వృద్ధుడు అని పిలిస్తే, నేను వృద్ధుడిని కాదు, వయసు మళ్లిన వ్యక్తిని…