
ఏఐజీ ‘ఠాగూర్ సినిమా’ – శవాన్ని దాచి… డబ్బు దోచి
సహనం వందే, హైదరాబాద్:పేదల ప్రాణాల కన్నా చివరి పైసా వసూలే ముఖ్యమనే కార్పొరేట్ హాస్పిటల్స్ దురాశకు హైదరాబాద్లోని ఏఐజీ సాక్ష్యంగా నిలిచింది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వచ్చిన 40 ఏళ్ల మురళీధర్ అనే వ్యక్తి ప్రాణం పోయినా ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి చివరి వరకు డబ్బు పిండుకుని చివరకు డెడ్ బాడీని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టిన దారుణ ఘటన ఇది. తమ కుటుంబ పెద్దను బతికించుకోవడానికి ఇల్లు అమ్ముకుని సర్వం కోల్పోయిన ఆ కుటుంబం…