వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి
సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…