శవంతో వివాహం… రక్తంతో సింధూరం – హత్యకు గురైన ప్రేమికుడితో పెళ్లి
సహనం వందే, మహారాష్ట్ర: నారాయణీ నదీ తీరాన నగరమంతా నిద్రపోతున్న వేళ… నాందెడ్‌లో కులాంతర ప్రేమకు మరణశాసనం లిఖించారు. 25 ఏళ్ల సాక్షాం తేట్, 21 ఏళ్ల అంచల్ మామిద్వార్… మూడేళ్ల వారి పవిత్ర ప్రేమను… అంచల్ కుటుంబం కులం పేరుతో చిదిమేసింది. సాక్షాంది మరాఠా (ఓసీ) కాగా… అంచల్‌ది మహార్ (ఎస్సీ). ఈ జాతి భేదం అంచల్ తండ్రి గణేష్ మామిద్వార్, అన్నదమ్ములు హిమేష్, సహిల్‌లు పరువు పేరుతో రగిలిపోయారు. గత నవంబర్ 27న జూనా…