
గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…