సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
సహనం వందే, హైదరాబాద్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు నెలకొన్నాయి. వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవ్వడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. కిడ్నీ మార్పిడికి రూ. 50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు…