
దసరా హీట్… టూర్ ట్రీట్ – లాంగ్ వీకెండ్ కు టూరిస్టుల ప్లాన్
సహనం వందే, హైదరాబాద్:దసరా పండుగ సందర్భంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా పర్యాటక డిమాండ్ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే లాంగ్ వీకెండ్ కోసం బుకింగ్లు గత సంవత్సరంతో పోలిస్తే ఏకంగా 20 నుంచి 25 శాతం పెరిగాయి. హోటల్ రిజర్వేషన్లు సైతం 14 నుంచి 16 శాతం పెరిగాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం పని ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం కోరుకోవడమే. కుటుంబాలు, యువత రెండు మూడు రోజుల వీకెండ్ గెటవేలకు…