
కోడిగుడ్ల కుంభకోణం? – అంగన్‌వాడీ పిల్లల ఆకలితో ఆటలు
సహనం వందే, హైదరాబాద్: అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు వ్యవహారం రాష్ట్ర అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. నెలల తరబడి సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అంగన్‌వాడీ పిల్లల పోషకాహారాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తాజాగా నాలుగోసారి దరఖాస్తు గడువు పొడిగింపుతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగించింది. కానీ టెండర్లు ఎప్పుడు తెరుస్తారో మాత్రం చెప్పకుండా దాగుడుమూతలు ఆడుతోంది. అంతులేని…