
కృష్ణా, గోదావరి నదీ జలాలపై కీలక ఒప్పందం
సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…