
కాళేశ్వరం డబ్బుతో థాయిలాండ్ లో కుమారుడి పెళ్లి
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఇరిగేషన్ శాఖలో అవినీతి ఏ స్థాయిలో తిష్ట వేసిందో ఏసీబీ దర్యాప్తులు స్పష్టం చేస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కావడం, ఈ కేసులో ఇరిగేషన్ శాఖలోని ఉన్నతాధికారుల పాత్రపై సంచలనం సృష్టిస్తోంది. శ్రీధర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించగా, ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆదేశాలను ధిక్కరించిన వైనం, ఇతర అధికారుల సహకారం ఈ అవినీతి…