ఐటీ ఆఫీసుల్లో ఆధునిక బానిసలు – డిజిటల్ కూలీలుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు
సహనం వందే, హైదరాబాద్/బెంగళూరు: మెరిసే గాజు భవనాలు… అత్యాధునిక క్యాంపస్‌లు… బిలియన్ డాలర్ల లాభాలు.. ఇదీ భారత ఐటీ రంగం ప్రపంచానికి చూపిస్తున్న ముఖచిత్రం. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక ఒక తరం యువత నిశ్శబ్దంగా నలిగిపోతోంది. 2026లోనూ 2013 నాటి వేతనాలనే ఆఫర్ చేస్తూ కార్పొరేట్ దిగ్గజాలు సాగిస్తున్న ఈ ఆర్ధిక ఉగ్రవాదాన్ని విశ్లేషకులు ఆధునిక బానిసత్వంగా అభివర్ణిస్తున్నారు. దశాబ్ద కాలపు దోపిడీప్రపంచం ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వైపు దూసుకుపోతుంటే… భారత ఐటీ కంపెనీల…