
వ్యవసాయ వర్సిటీలో అవినీతి పంట – ఆచార్య ఎన్‌జీ రంగా వీసీపై ఫిర్యాదులు
సహనం వందే, గుంటూరు:ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అవినీతికి నిలయంగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వవిద్యాలయానికి తాత్కాలిక వీసీగా వ్యవహరిస్తున్న వ్యక్తి అక్రమాలకు పాల్పడుతున్నారని, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఓ ప్రొఫెసర్ స్వయంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వర్సిటీలో జరుగుతున్న చీకటి కార్యకలాపాలకు అద్దం పడుతున్నాయి. నిబంధనలను బేఖాతరు చేస్తూ పాలక మండలిని విస్మరించి కోరం లేకుండానే రెండు సంవత్సరాలుగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే…